పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’ చివరి షెడ్యూల్ షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి పీరియాడికల్ చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన పాత్రలో ప్రేక్షకులను స్టన్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.
అయితే, ఈ సినిమాను మార్చి 28న గ్రాండ్ రిలీజ్ చేస్తామని గతంలో చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేశారు. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, ఈ సినిమా అనుకున్న డేట్‌కు రావడం కష్టం అనిపిస్తుంది. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, మే 9న మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రం రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, ఆ సినిమా కూడా అనుకున్న డేట్‌కు రావడం లేదు. దీంతో ఇప్పుడు వీరమల్లు ఆ ప్లేస్‌లో రావాలని చూస్తున్నాడు.
మే 9న హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటే, వేసవి బరిలో భారీ చిత్రాల రేసులో ఈ మూవీ ముందుగా వస్తుంది. మరి మే 9న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారా.. లేక వేరే ఏదైనా డేట్‌ను ఫిక్స్ చేస్తారా అనేది చూడాలి. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏ.ఎం.రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు.
