ఎన్.టి.అర్ కోసం కథ రెడీ చేస్తున్న హరీష్ శంకర్.!

jr-ntr-and-harish-shankar
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం తన 25వ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. విభిన్న చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ లండన్లో జరుగుతోంది. 2016 సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ చేయాలని ఈ సినిమాని శరవేగంగా ఫినిష్ చేస్తున్నారు. ప్రసతుతం ఎన్.టి.ఆర్ దృష్టి మొత్తం ఈ సినిమాపైనే పెట్టడంతో తన నెక్స్ట్ సినిమా ఎవరితో అనేది అధికారికంగా ఖరారు కాలేదు. కానీ ఎన్.టి.ఆర్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్న దర్శకులు చాలా మందే ఉన్నారు.

తాజాగా అందిన సమాచారం ప్రకారం మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఎన్.టి.ఆర్ కోసం ఓ కథని రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఇటీవలే ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ షూటింగ్ ఫినిష్ చేసిన హరీష్ ఎన్.టి.ఆర్ సినిమా కోసం కథ రాసే పనిలో నిమగ్నమై ఉన్నాడని సమాచారం. ఎన్.టి.ఆర్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘రామయ్యా వస్తావయ్యా’ ప్రేక్షకులని పెద్దగా మెప్పించకపోవడంతో హరీష్ ఈ సారి ఎన్.టి.ఆర్ కోసం చాలా పవర్ఫుల్ కథని సిద్దం చేస్తున్నాడు. హరీష్ శంకర్ కాకుండా కొరటాల శివ, గోపీచంద్ మలినేని, వక్కంతం వంశీలు కూడా ఎన్.టి.ఆర్ తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఇంకా ఏదీ ఖరారు కాలేదు.

ప్రస్తుతం అభిమానులంతా ఎన్.టి.ఆర్ ఈ నలుగురు దర్శకులలో ఎవరికి తన నెక్స్ట్ సినిమా ఛాన్స్ ఇస్తాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏ కాంబినేషన్ అయినా క్రేజ్ మాత్రం ఎక్కువగానే ఉంటుంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Exit mobile version