క్రేజీ లైన్ తో ‘ఖుషి’ సీక్వెల్ ప్లాన్ చేసిన హరీష్ శంకర్!

Harish-shankar

ఈ ఉగాది కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి. సాలిడ్ హైప్ ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు హరీష్ శంకర్ చేసిన పలు కామెంట్స్ మంచి ఇంట్రెస్టింగ్ గా మారాయి. తాను ఉస్తాద్ కంటే ముందు భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

మంచి కాలేజ్ వైబ్స్ తో ఆ సినిమాని అనుకున్నారు కానీ తర్వాత మారింది. కానీ తాను ఖుషి సినిమాకి సీక్వెల్ లైన్ తో ఆ సబ్జెక్టు రాసుకున్నట్టు తెలిపారు. ఖుషి సినిమాలో హీరో హీరోయిన్స్ ఈగో క్లాష్ వచ్చి విడిపోయి మళ్ళీ ఒకే కాలేజ్ లో లెక్చరర్ లు గా చేరితే అక్కడ నుంచి వారిపై స్టోరీ ఎలా ఉంటుంది అనే లైన్ పై తాను ఓ ఏడాది పాటు వర్క్ చేసినట్టు కూడా తెలిపారు. ఇది వినేందుకు ఒకింత ఇంట్రెస్టింగ్ గానే ఉంది కానీ రియాలిటీలోకి కూడా వచ్చి ఉంటే ఎలా ఉండేదో మరి.

Exit mobile version