హ్యాట్సాఫ్ టు ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ డైలాగ్స్..

Malli-Malli-idi-rani-roju

తెలుగులో వచ్చిన మంచి ఫీల్ గుడ్ లవ్ స్టొరీలలో ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. శర్వానంద్, నిత్యా మీనన్ లు ఒకరితో ఒకరు పోటిపడి నటించారు. మెచ్యూర్ లవ్ స్టొరీగా తెరకెక్కిన ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ అద్బుతంగా పండింది. ఈ స్వచ్చమైన ప్రేమకథను క్రాంతి మాధవ్ తెరకెక్కించిన తీరు అద్బుతం.

ముఖ్యంగా ఈ సినిమాలో సాయి మాధవ్ బుర్రా రాసిన సంభాషణలు ప్రతి ఒక్కరి మనసును హత్తుకున్నాయి. థియేటర్లో ప్రేక్షకులను కదిలించాయి. ఈ ప్రేమకథలో ఫీలింగును ఆవిష్కరించడంలో డైలాగ్స్ ముఖ్య భూమిక పోషించాయి.

‘బ్రతుకును లెక్క చేయకపోయినా పర్వాలేదు, చావును గౌరవించాలి’

‘బిడ్డ ఆకలి తీరాకే అమ్మకి ఆకలి మొదవుతుంది’

‘ఆ అమ్మాయి కళ్ళు చూసి చావు కూడా కొత్తగా బ్రతికిస్తుందని నాకు ఆ రోజే తెలిసింది, ఆ చావు పేరే ప్రేమ’

‘ఇన్నాళ్ళు ఆగితేనే ప్రేమ అవుతుందని రూల్ ఏమైనా ఉందా..?’

‘ఏ మతంలోనైన ఒకేలా ప్రేమించుకుంటారు’

వంటి డెప్త్‌ ఉన్న డైలాగ్స్‌ సినిమాలో చాలా ఉన్నాయి. ‘కృష్ణం వందే జగద్గురుమ్’, ‘గోపాల గోపాల’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ సినిమాలతో తన ప్రతిభను నిరూపించుకున్నారు సాయి మాధవ్ బుర్రా. తెలుగు చిత్ర పరిశ్రమకు మరో టాలెంటెడ్ డైలాగ్ రైటర్ దొరికినట్టే.

Exit mobile version