హాలీవుడ్ మూవీ ‘హీ-మ్యాన్’కి వాయిస్ ఓవర్ ఇస్తున్న నిఖిల్ సిద్ధార్థ్.. జూన్ 5న రిలీజ్

హాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ మూవీ ఇటు ఇండియన్ ఆడియన్స్‌ను సైతం అలరించేందుకు సిద్ధమవుతోంది. రీసెంట్‌గా రిలీజైన ఇంగ్లీష్ ట్రైలర్‌కు వరల్డ్ వైడ్‌గా భారీ రెస్పాన్స్ రాగా.. తాజాగా మేకర్స్ తెలుగు ట్రైలర్‌ను వదిలారు. ఇందులో తెలుగు ప్రేక్షకులకు ఓ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు.

ఈ హాలీవుడ్ మూవీ తెలుగు వెర్షన్‌లో ప్రధాన పాత్రల డబ్బింగ్ కోసం మన టాలీవుడ్ స్టార్స్‌ను రంగంలోకి దించారు. హీరో ‘హీ-మ్యాన్’ పాత్రకు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తన వాయిస్ అందించారు. పాన్ ఇండియా హిట్లతో ఇమేజ్ తెచ్చుకున్న నిఖిల్.. ఈ ఐకానిక్ హాలీవుడ్ క్యారెక్టర్‌కు డబ్బింగ్ చెప్పడం ఫ్యాన్స్‌లో ఆసక్తి పెంచుతోంది.

మరోవైపు, ఈ సినిమాలో విలన్ ‘స్కెలెటర్’ పాత్రకు ప్రముఖ నటుడు ఆదిత్య మీనన్ తన బేస్ వాయిస్‌తో జీవం పోశారు. ఇక డంకన్ క్యారెక్టర్‌కు సీనియర్ యాక్టర్ రావు రమేష్ డబ్బింగ్ చెప్పారు. ఇలా మనకు బాగా తెలిసిన, పాపులర్ అయిన గొంతులు వినిపిస్తుండటంతో ‘ఎటెర్నియా’ ప్రపంచంలోని యాక్షన్, ఫాంటసీ ఎమోషన్స్‌కు తెలుగు ఆడియన్స్ మరింత ఈజీగా కనెక్ట్ అవుతారు.

అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ నిర్మాణంలో ట్రావిస్ నైట్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ మూవీలో నికోలస్ గలిట్జైన్ ప్రిన్స్ ఆడమ్ (హీ-మ్యాన్)గా, కమిలా మెండెస్ టీలాగా నటిస్తున్నారు. జారెడ్ లెటో (స్కెలెటర్), ఇడ్రిస్ ఎల్బా (మ్యాన్-అట్-ఆర్మ్స్), అలిసన్ బ్రి, క్రిస్టెన్ విగ్ లాంటి హాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌ను సోనీ పిక్చర్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తోంది. జూన్ 5వ తేదీన ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో ఈ సినిమా ఇండియన్ థియేటర్లలోకి రాబోతోంది. కొత్త తరానికి ఈ సరికొత్త ‘హీ-మ్యాన్’ ప్రపంచం ఎలాంటి విజువల్ ట్రీట్ ఇస్తుందో చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version