
మన స్టార్ హీరోలు తమ సినిమాల్లో ప్రక్జలను ఉద్దేశించి లేదా ఓవరాల్ గా సోషల్ మెసేజ్ ఇవ్వడం అనేవి కామన్ గా జరుగుతుంటాయి. కానీ వారు సినిమాలో చెప్పిన సూక్తులను పాటించే హీరోలు కూడా కొందరు ఉంటారు. ఎప్పుడైతే రీల్ లైఫ్ లో హీరోలుగా కనిపించే స్టార్స్ రియల్ లైఫ్ లో కూడా అసలైన హీరోలు అనిపించుకుంటారో అప్పుడు వారి పేరు ప్రఖ్యాతలు అమాంతం పెరిగిపోవడమే కాకుండా వారి అభిమానులు కూడా వారి బాటలోనే పయనించాలని అనుకుంటారు, వారిలానే పలు సామాజిక కార్యక్రమాలను చేపడతారు. మహేష్ బాబు హీరోగా నటించిన ‘శ్రీమంతుడు’ సినిమా ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో మహేష్ బాబు ‘మన పల్లెటూళ్ళని మనమే కాపాడుకోవాలని, అవసరం అయితే దత్తత తీసుకొని మరీ బాగు చెయ్యాలనే సందేశాన్ని’ ఇచ్చారు.
కేవలం సందేశాన్ని ఇవ్వడమే కాకుండా ఆంధ్ర, తెలంగాణాలో ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవడానికి సిద్దం అయ్యాడు. ఆంధ్రలో తన సొంత ఊరైన బుర్రిపాలెం ని తీసుకుంటా అని ముందే ప్రకటించాడు. తాజాగా తెలంగాణాలో ఏ విలేజ్ ని దత్తత తీసుకోవాలనే విషయంపై నిర్ణయం తీసుకున్నారు. ఫైనల్ గా శ్రీమంతుడు టీం మహేష్ బాబు మబూబ్ నగర్ జిల్లా కొతూర్ మండలంలోని సిద్దాపురం గ్రామాన్ని దత్తత తీసుకోవడానికి సిద్దమయ్యాడు. ప్రస్తుతం మహేష్ బాబు టీం సిద్దాపురంని ఎలా డెవలప్ చెయ్యాలి అనే విషయంలో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. త్వరలోనే దత్తత విషయంలో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలోనే డెవలప్ మెంట్ వర్క్ ని మొదలు పెడతారు.