డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కోర్టుకు హాజరైన యంగ్ హీరో

sushanth 1

యంగ్ హీరో ప్రిన్స్ సుశాంత్ నేడు కూకట్ పల్లి కోర్టుకి హాజరయ్యారు. ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముద్దాయిగా ఉండటంతో కోర్ట్ కి హాజరైనట్టు సమాచారం. వివరాలలోకి వెళితే టివి, మరియు సినీ ఆర్టిస్టుగా ఉన్న ప్రిన్స్ ఈనెల 24 ఆదివారం హైదరాబాద్ బాచుపల్లి సమీపంలో గల విఎన్ఆర్ కాలేజ్ సమీపంలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో పట్టుబడ్డారు. ఆసమయంలో తాగి కార్ డ్రైవింగ్ చేస్తున్న ప్రిన్స్ పై పోలీసులు కేసునమోదు చేశారు. ఆ కేసు నేడు విచారణకు రావంతో ఆయన కూకట్ పల్లి కోర్ట్ కి హాజరయ్యారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ నేరానికి గాను జడ్జ్ ప్రిన్స్ కి జరిమానా విధించడంతో పాటు గట్టిగా మందలించారని సమాచారం. డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా వరుసగా అనేక ప్రమాదాలు జరుగుతున్నా కొందరిలో చలనం రావడం లేదు. అందుకే పోలీసులు సామాన్యులు, సెలెబ్రిటీలు అనే తేడా లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రిన్స్ నీకు నాకు డాష్ డాష్ , బస్ స్టాప్, రొమాన్స్, వేర్ ఈజ్ విద్యాబాలన్ వంటి చిత్రాలతో నటించారు.

Exit mobile version