ఈమధ్య సినిమా ప్రమోషన్లు అంటే సోషల్ మీడియానే. కేవలం యువత మాత్రమే కాదు ఇంటర్నెట్ పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను బాగా ఫాలో అవుతున్నారు. అందుకే మన సినిమా హీరోలు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రమ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ప్రేక్షకులకు దగ్గరగా ఉంటూ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ మాధ్యమాల జాబితాలో టిక్ టాక్ కూడా చేరింది.
ప్రస్తుతం టిక్ టాక్ యాప్ లేని స్మార్ట్ ఫోన్ లేదు. మన తెలుగు కుర్రకారు ఈ యాప్ ను విపరీతంగా వాడుతున్నారు. అందుకే దాని ద్వారా ప్రమోషన్స్ చేస్తున్నాడు హీరో కార్తికేయ. ఆయన నటించిన కొత్త చిత్రం ’90 ఎం.ఎల్’ ఈ నెల 5న విడుదలకానుంది. అందుకే యువతకు దగ్గరకావడం కోసం కార్తికేయ టిక్ టాక్ యాప్లో ఎక్కువ ఫాలోవర్లు కలిగిన యువతీ యువకులతో కలిసి తన సినిమా పాటలకు డ్యాన్సులు వేస్తూ, సినిమాలోని డైలాగ్స్ చెబుతూ హడావుడి చేస్తున్నారు. టిక్ టాకర్స్ సైతం హీరోనే నేరుగా ప్రమోషన్లకు ఆహ్వానించడంతో ఎంతో ఉత్సాహంగా ఆయనతో కలిసి ఆడిపాడేస్తున్నారు.
