చేతి గాయం నుంచి కోలుకుంటున్న రామ్

Pandaga-chesk
గత కొద్దికాలం క్రితం నుండీ ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తూ వచ్చిన రామ్, రీసెంట్‌గా వచ్చిన పండగ చేస్కోతో అ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక ‘పండగ చేస్కో’ ఇచ్చిన విజయంతో జోష్ మీదున్న ఈ ఎనర్జిటిక్ హీరో తమ సొంత బ్యానర్ స్రవంతి మూవీస్‌పై ‘శివం’, ‘హరికథ’ పేర్లతో రెండు వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా మారిపోయిన విషయం తెలిసిందే. ఈ మధ్యే ఊటిలో బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్‌తో బిజీగా గడిపిన రామ్, ఓ ఫైట్ సీన్ తీసేప్పుడు గాయపడ్డాడు. చేతికి పెద్ద గాయమే తగలడంతో రెండు వారాల పాటు రెస్ట్ తీసుకోమని డాక్టర్స్ సలహా ఇచ్చారు.

కాగా డాక్టర్స్ సలహాను బేఖాతరు చేసిన రామ్, గాయాన్ని లెక్కచేయకుండా మరో ఫైట్ సీన్‌లో పాల్గొన్నాడు. దీంతో గాయం మరింత పెద్దదై ఇప్పుడు నెలరోజులు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ గాయం నుంచి రికవరీ అయ్యేందుకు రామ్ రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇక ఓ నెలరోజులు కాగానే మళ్ళీ విదేశాల్లో జరిగే షూటింగ్ కోసం సిద్ధం కానున్నాడట. హరికథ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకుడు కాగా, శివం సినిమాను కొత్త దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు.

Exit mobile version