హీరో విశాల్ అరెస్ట్ !

Vishal

తమిళ యాక్షన్ హీరో నడిగర్ సంగం అధ్యకుడు విశాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా తమిళ నిర్మాత మండలి లో విభేదాలు నెలకొన్నాయి. సమస్యలను పట్టించుకోవడం లేదని పైరసీని అరికట్టడంలో విశాల్ వైఫల్యం చెందాడని కొందరు తమిళ నిర్మాతలు విశాల్ ను నడిగర్ సంగం లోకి రానివ్వకుండా కార్యాలయానికి తాళం వేశారు. దాంతో ఆగ్రహించిన విశాల్ తాళం పగులకొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పరిస్థితి అదుపుతప్పింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు విశాల్ ను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

ఇక రేపు కోలీవుడ్ లో ఏకంగా 9సినిమాలు విడుదలవుతుండడంతో ఒకేసారి ఇన్ని సినిమాల విడుదలకు పర్మిషన్ ఎలా ఇస్తారని చిన్న నిర్మాతలు విశాల్ ఫై ఫైర్ అవుతున్నారు.

Exit mobile version