
సౌత్ ఇండియన్ సూపర్ సక్సెస్ఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ మణిరత్నం. ఆయన దగ్గర పనిచెయ్యాలనే ఆశ చాలా మంది టెక్నీషియన్స్ కి ఉంటుంది. తాజాగా అలాంటి అవకాశాన్ని ఓ తమిళ స్టార్ హీరో కుమార్తె కొట్టేసింది. మణిరత్నం దర్శకత్వం దర్శకత్వంలో వచ్చిన ‘అమృత’ సినిమా గుర్తుందా. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన కీర్తన గుర్తుందా. ఈ కీర్తన తమిళ స్టార్ హీరో అయిన ప్రతిభన్ కుమార్తె. తను ఇన్నేళ్ళ గ్యాప్ తర్వాత మళ్ళీ సినీ రంగంలోకి అడుగుపెడుతోంది.
అది కూడా మణిరత్నం దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేయనుండడం విశేషం. మణిరత్నం తన తదుపరి సినిమాని కార్తీ – దల్క్వేర్ సల్మాన్ లతో చేయనున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాకి కీర్తన అసిస్టెంట్ డైరెక్టర్ గా పరిచయం కానుంది. ప్రస్తుతం కీర్తన ఈ సినిమాలోని పాత్రల కోసం ఆడిషన్స్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్స్ గా శృతి హాసన్, నయనతారలను సెలక్ట్ చేసారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.