పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరి హర వీరమల్లు’. ఈ చిత్రం మే 9, 2025న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఐతే, పవన్ కళ్యాణ్ ఇటీవలే తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తన పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడటంతో సింగపూర్ కు వెళ్లారు. చికిత్స సమయంలో పవన్ కళ్యాణ్ తన కొడుకు పక్కనే ఉన్నారు. అదృష్టవశాత్తూ, మార్క్ శంకర్ చాలా త్వరగా కోలుకుంటున్నాడు. తన కొడుకుతో కలిసి నిన్న రాత్రి హైదరాబాద్ కు తిరిగి వచ్చారు పవన్.
దీంతో ఫ్యాన్స్ దృష్టి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరి హర వీర మల్లు చిత్రం వైపు పడింది. పవన్ కి ఇంకా 3 నుంచి 5 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి పవన్ త్వరలోనే సెట్స్ కి తిరిగి వచ్చి తన భాగాన్ని పూర్తి చేస్తారని తెలుస్తోంది. విడుదల తేదీ కూడా మే 9, 2025. కాబట్టి, ప్రమోషనల్ కంటెంట్‌ను విడుదల చేయాలని చిత్రబృందాన్ని ఫ్యాన్స్ అభ్యర్థిస్తున్నారు. కాగా డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ తో పాటు బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు మరియు నోరా ఫతేహి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అన్నట్టు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాలోని పలు సన్నివేశాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే
