ప్రపంచ వ్యాప్తంగా సంగీత రంగంకి ఉన్న ఆదరణ ఎలాంటిదో చాలా మందికే తెలిసే ఉంటుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషల్లో అనేకమంది పాప్ స్టార్స్ ఉన్నారు. ఇక మన ఇండియన్ సినిమా నుంచి కూడా చాలా మంది ఉంటే వారిలో బాలీవుడ్ సెన్సేషన్ హిమేష్ రేషమ్మియా ఇప్పుడు ఓ అరుదైన ఘనత అది కూడా గ్లోబల్ లెవెల్లో సాధించి సంచలనం సెట్ చేశారు.
అయితే వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి మోస్ట్ ఇన్ఫ్లూయెన్సల్ పాప్ స్టార్స్ జాబితాని ప్రముఖ బ్లూమ్ బర్గ్ సంస్థ రివీల్ చేయగా అందులో అనేకమంది ఇతర దేశాల ఫేమస్ స్టార్స్ తో పాటుగా హిమేష్ పేరు కూడా కనిపించడం ఇండియన్ సినిమాకి ఇండియన్ సంగీత పరిశ్రమకి ఎంతో గర్వకారణంగా నిలిచింది. దీనితో ఈ గాయకుడూ, సంగీత దర్శకుడు అలాగే నటుడు హిమేష్ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది.
ఇక ఈ వార్త బయటకి వచ్చాక సినీ ప్రముఖులు కూడా తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి హిమేష్ నుంచి తెలుగు ఆడియెన్స్ కి చెప్పాలంటే ఝలక్ దిఖల్ ఆజా, ఆశిక్ బనాయా సాంగ్స్ పేర్లు చెప్తే యిట్టె అర్ధం అయ్యిపోతుంది. అతనే ఇతను. ప్రపంచ వ్యాప్తంగా ఒకే ఒక్క భారతీయుడిగా ఈ లిస్ట్ నిలిచి హిస్టరీ క్రియేట్ చేసాడట.
