
సినీ పరిశ్రమలో ఒక కాంబినేషన్ లో హిట్ వచ్చింది అంటే అదే కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంటే అంచనాలు మరింత పెరుగుతాయి. అదే రెండు, మూడు సార్లు హిట్ అందుకున్న కాంబినేషన్ అయితే అంచనాలతో పాటు ఈ సారి కూడా హిట్ కొట్టేస్తారు అన్న భావన కలుగుతుంది. ఇప్పుడు అలాంటిదే ఓ కాంబినేషన్ సెట్ చెయ్యడానికి యంగ్ డైరెక్టర్ ట్రై చేస్తున్నాడు. కార్తికేయ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయిన యంగ్ డైరెక్టర్ చందు మొండేటి తన తదుపరి సినిమాని నాగ చైతన్యతో చేయనున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ సినిమా కోసం నాగ చైతన్య సరసన తమన్నాని హీరోయిన్ గా సెలక్ట్ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. గతంలో నాగ చైతన్య – తమన్నా కాంబినేషన్ లో వచ్చిన ‘100% లవ్’, ‘తడాఖా’ సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద హిట్ అయ్యాయి. అందుకోసమే వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్ ని ప్లాన్ చేస్తున్నారు. ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మించనున్నాడు. తమన్నాని ఫైనల్ చేసిన విషయంపై ప్రొడక్షన్ హౌస్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.