సూపర్ స్టార్ కి పోటీగా హాలీవుడ్ సినిమా !

సూపర్ స్టార్ రజనీకాంత్‌ స్టార్ డమ్ గురించి ప్రత్కేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న ఏకైక సౌత్ హీరో ఆయన. పెద్ద స్టార్లు కూడా ఆయన చిత్రానికి పోటీగా తమ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంటారు. అలాంటిది రేపు విడుదలకానున్న ఆయన చిత్రం ‘కాలా’ను ఒక హాలీవుడ్ సినిమా ఢీ కొట్టనుంది. డైనోసార్ల నేపథ్యంలో తెరకెక్కి 2015లో విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం ‘జురాసిక్‌ వరల్డ్‌’.

ఆ చిత్రానికి కొనసాగింపుగా ‘జురాసిక్‌ వరల్డ్‌: ఫాలెన్‌ కింగ్‌డమ్‌’ అనే చిత్రం రూపుదిద్దుకుంది. ఇది ‘కాలా’కు పోటీగా జూన్ 7నే తెలుగు, తమిళం, హిందీ భాషలన్నిటీలోనూ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఈ సినిమా విడుదలవ్వబోతుంది. ‘జురాసిక్‌ వరల్డ్‌’ శిరీష్ కూడా అభిమానులు భారీ సంఖ్యలోనే ఉన్నారు. ఈ చిత్రం కోసం ఎప్పుడెప్పుడా అన్నట్టు ఎదురుచూస్తున్నారు. కాబట్టి ‘కాలా’ కి ఈ చిత్రం కొంత గట్టిగానే పోటీ ఇవ్వొచ్చు.

Exit mobile version