కేరళలో సర్కార్ కు భారీ డిమాండ్ !

sarkar

ఇళయదళపతి విజయ్ నటిస్తున్న ‘సర్కార్’ ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈచిత్రం యొక్క కేరళ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వొల్మార్ట్ ఈచిత్రాన్ని 10కోట్లకు దక్కించుకుంది. తమిళ చిత్రానికి అక్కడ ఈరెంజ్లో బిజినెస్ జరగడం ఇదే మొదటిసారి.

మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో రానున్న ఈ చిత్రానికి ఏఆర్ రహమేన్ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 2న ఈ చిత్రం యొక్క ఆడియోవేడుకను గ్రాండ్ గా జరుపనున్నారు. ఇక ఈనెల 19న ఈ చిత్రానికి సంభందించిన అప్ డేట్ వెలుబడనుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం దీపావళి కి విడుదలకానుంది.

Exit mobile version