అమెరికాలో కూడ డల్ అయిన ‘ఛల్ మోహన్ రంగ’ !

నితిన్ 25వ చిత్రం ‘ఛల్ మోహన్ రంగ’ గత గురువారం విడుదలై మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టుకున్నా మిశ్రమ స్పందన మూలాన తర్వాతి రోజు నుండి నెమ్మదించింది. ఇక వీక్ డేస్ లో అయితే వసూళ్ళలో తగ్గుదల ఎక్కువగా కనిపిస్తోంది. ఇక అమెరికాలో కూడ ఇదే పరిస్థితి కనబడుతోంది.

తొలిరోజు డీసెంట్ ఓపెనింగ్స్ అందుకుని శుక్రవారం నాటికి 2.9 లక్షల డాలర్లను ఖాతాలో వేసుకున్న ఈ సినిమా సోమవారం 9,500 డాలర్లను, మంగళవారం 11,980 డాలర్లను మాత్రమే వసూలు చేసి ఇప్పటకి వరకు 4.45 లక్షల్ని రాబట్టి కష్టం మీద హాఫ్ మిలియన్ కు దగ్గరైంది. ఇక రేపు నాని ‘కృష్ణార్జున యుద్ధం’ విడుదల కానుండటంతో ఈ వసూళ్లు ఇంకాస్త తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

Exit mobile version