మెగాస్టార్ నటించిన ‘సైరా’ చిత్ర విడుదలకు ఇంకొన్ని గంటలే సమయం ఉంది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు స్పెషల్ షోలు వేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఈ షోస్ కన్ఫర్మ్ అవగా చెన్నై సిటీలో సైతం భారీ స్థాయిలో స్పెషల్ షోస్ వేయనున్నారు.
చెన్నైలోని తెలుగు ప్రేక్షకుల కోసం మొదటి రోజు మొత్తం ఉదయం 8 గంటల స్పెషల్ షోలు 50 ఎర్పాటయ్యాయి. ఇది కూడా కేవలం తెలుగు వెర్షన్ వరకే కావడం విశేషం. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఇన్ని స్పెషల్ షోలు వేయలేదు. ఈమధ్యే విడుదలైన ‘సాహో’కి కూడా 30 స్పెషల్ షోలు వేయడం జరిగింది. సో ఇక్కడ కూడా ‘సైరా’ కొత్త రికార్డ్ నెలకొల్పింది.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ తమిళనాట విడుదల చేయనుంది. విజయ్ సేతుపతి, నయనతార లాంటి బడా స్టార్స్ ఇందులో నటించడంతో తమిళ ప్రేక్షకుల్లో కూడా సినిమాపై మంచి అంచనాలున్నాయి. రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు.
