శృతి హాసన్ కి పెద్ద రిలీఫ్

శృతి హాసన్ కి పెద్ద రిలీఫ్

Published on Apr 20, 2015 3:22 PM IST

Shruthi-Hassan1
ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీ గా ఉన్నా హాట్ అండ్ క్రేజీ హీరోయిన్ శృతి హాసన్. నాగార్జున – కార్తీ కలిసి వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో చేయనున్న సినిమా నుంచి శృతి హాసన్ తప్పుకుందని పివిపి వారి పిక్చర్ హౌస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వారు పోలీస్ స్టేషన్ లో కేసు వేసి సివిల్ రూల్స్ ప్రకారం శృతి మీద యాక్షన్ తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా ఇరు పార్టీల మధ్య కోర్టులో కొన్ని వాదనలు జరిగాయి.

ఫైనల్ గా ఈ విషయంలో శృతి హాసన్ కి పూర్తి రిలీఫ్ దొరికింది. తమిళ్ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మరియు సౌత్ ఇండియా ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ఇద్దరూ కలిసి ఈ విషయాన్ని డీల్ చేసారు. వీరి రిక్వెస్ట్ మేరకు ది పిక్చర్స్ హౌస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వారు కేసుని విత్ డ్రా చేసారు. ఇరు ఫిల్మ్ కౌన్సిల్స్ మీద ఉన్న గౌరవం మరియు ముందు ముందు ఇండస్ట్రీలో కలిసి మెలగాలి కావున వారు శృతి హాసన్ పై ఉన్న కేసును వెనక్కి తీసుకున్నారు. కానీ ప్రొడక్షన్ హౌస్ మాత్రం యాక్టర్స్ ఒకసారి సినిమాకి సైన్ చేసాకా అగ్రిమెంట్స్ కి కట్టుబడి ఉండాలని అన్నారు.

తాజా వార్తలు