
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడం జరిగింది. ఈ చిత్రం కి రాక్ స్టార్ అనిరుద్ రవి చందర్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని పాటలు ఆడియెన్స్ లో మరింత క్రేజ్ ను సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఈ చిత్రం లోని హుకుం పాట మ్యూజిక్ ప్లాట్ ఫామ్ అయిన స్పోటిఫీ లో 100 మిలియన్స్ కి పైగా స్ట్రీమింగ్ అయ్యింది. రమ్య కృష్ణ, యోగి బాబు, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, సునీల్, జాకీ ష్రాఫ్, తమన్నా భాటియా లు ఇందులో కీలక పాత్రల్లో నటించారు.
Indrum Endrum #Hukum Alapparai-dhan???? 100M+ streams on Spotify???? #Jailer
▶ https://t.co/E8jP6bEjkf@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @soupersubu #Jailer pic.twitter.com/rMofGJ2aHE
— Sun Pictures (@sunpictures) November 30, 2023