బంపర్ ప్రైజ్ కి జీ సొంతమైన ‘బాహుబలి’ శాటిలైట్ రైట్స్

baahubali

గత నాలుగు రోజులుగా ఇండియా వ్యాప్తంగా మారుమ్రోగిన పేరు బాహుబలి, మరి రెండు రోజుల నుంచి సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి బాహుబలి రికార్డ్ కలెక్షన్స్. మొదటి రోజు వేసిన ప్రీమియర్ షోస్ నుంచే బాహుబలి సరికొత్త రికార్డ్స్ కి శ్రీకారం చుట్టింది. సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి బ్రాండ్ కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, తమన్నా, అనుష్కల స్టార్డం కూడా తోడవడంతో బాహుబలి మూవీ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఓవర్సీస్ లలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.

బాహుబలి సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో పాటు సెన్సేషనల్ కలెక్షన్స్ సాదిస్తుండడంతో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కి ఎనలేని డిమాండ్ నెలకొంది. ఇప్పటికే బాహుబలి హిందీ శాటిలైట్ రైట్స్ ని సోనీ పిక్స్ వారు 17 కోట్లకి సొంతం చేసుకున్నారని ఇది వరకే తెలియజేశాం. ఇదే విధంగా తెలుగులో కూడా టాప్ ఛానల్స్ అన్నీ బాహుబలి శాటిలైట్ రైట్స్ కోసం పోటీ పడ్డాయి. ఈ పోటీలో చివరికి జీ తెలుగు వారు 16 కోట్లకి పైగా ఖర్చు పెట్టి బాహుబలి తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. తెలుగు సినిమా శాటిలైట్ రికార్డ్స్ ఇంత్త రేటుకి అమ్ముడు పోవడం ఇదే ప్రధమం కావడంతో బాహుబలి శాటిలైట్ రేట్స్ విషయంలో రికార్డ్ క్రియేట్ చేసింది. మరోవైపు తమిళంలో కూడా శాటిలైట్ రైట్స్ విషయంలో పోటీ జరుగుతోంది.

Exit mobile version