బాలయ్య ‘డిక్టేటర్’పై ఆసక్తికర విశేషాలు

బాలయ్య ‘డిక్టేటర్’పై ఆసక్తికర విశేషాలు

Published on Nov 25, 2015 5:55 PM IST

dictatoot
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 99వ సినిమా ‘డిక్టేటర్’. సంథింగ్ డిఫరెంట్ గా ఉంటూనే, తన అభిమానులు కోరుకునే అంశాలు కూడా ఉండాలని అడగడంతో కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి ఈ సినిమా కథని ‘బాలయ్య’ కోసం స్పెషల్ గా తయారు చేసారు. ఆ సినిమానే డిక్టేటర్.. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. డిసెంబర్ 20న ఈ సినిమా ఆడియోని గ్రాండ్ గా రిలీజ్ చేసి, సంక్రాంతి కానుకగా సినిమాని రిలీజ్ చేయనున్నారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ చిత్ర కథా రచయితల్లో ఒకరైన గోపి మోహన్ ఈ సినిమా గురించిన ఆసక్తికర విషయాలను తెలియజేశాడు.

‘డిక్టేటర్ సినిమాలో మా ఫార్మాట్ కామెడీ కూడా ఉంటుంది అలా అని రెగ్యులర్ బకరా ఫార్మాట్ లో ఉండదు. అంతా సందర్భానుసారంగా వచ్చే కామెడీనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే బాగా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ లో మా మార్క్ కనపడుతుంది. సెకండాఫ్ ని మాత్రం బాలయ్య బాబు అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అదే ఫార్మాట్ లో ఉండేలానే రాసాము. డిక్టేటర్ అనే సినిమా బాలకృష్ణ కెరీర్లో మోస్ట్ స్టైలిష్ ఫిల్మ్ అయ్యేలా ప్లాన్ చేసామని’ గోపి మోహన్ తెలిపాడు. బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు