“అడుగు అడుగునా” లిరికల్ సాంగ్‌ను ఆవిష్కరించిన సీ.వి. ఆనంద్

Untitled 4

ఆశ్లీ క్రియేషన్స్ నిర్మిస్తున్న “మిస్స్టీరియస్” చిత్రంలోని లిరికల్ సాంగ్ “అడుగు అడుగునా”ను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీ.వి. ఆనంద్ గారి చేతుల మీదుగా ఈ రోజు ఆవిష్కరించారు.

పోలీసు అధికారుల అంకితభావం, నిబద్ధతను ప్రతిబింబించేలా చిత్రీకరించిన ఈ పాటను వీక్షించిన కమిషనర్ సీ.వి. ఆనంద్ గారు, గాయకుడు ఎంఎల్ఆర్ కార్తికేయన్ గాత్రాన్ని, పాటను అద్భుతంగా విజువలైజ్ చేసిన తీరును ప్రశంసించారు. పోలీస్ సేవాస్ఫూర్తిని హృదయానికి హత్తుకునేలా ఆలపించినందుకు ఆయనను అభినందించగా, పాట రచనతో పాటు సంగీత దర్శకుడిగా వ్యవహరించిన ఎంఎల్ రాజాను కూడా మెచ్చుకున్నారు. కొత్త కోణంలో సస్పెన్స్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించిన దర్శకుడు మహి కోమటిరెడ్డికి, అమెరికాలో స్థిరపడి ఉన్నా ఎన్నో సవాళ్లను అధిగమించి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత జయ్ వల్లందాస్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

విడుదల కార్యక్రమంలో హీరో రోహిత్ సాహిని, గౌతమ్, దర్శకుడు మహి కోమటిరెడ్డి, నిర్మాత జయ్ వల్లందాస్, సహనిర్మాత రామ్ ఉప్పు (బన్నీ రామ్) తదితరులు పాల్గొన్నారు.

మా చిత్రంలోని లిరికల్ పాటను సమయాన్ని కేటాయించి విడుదల చేసిన కమిషనర్ సీ.వి. ఆనంద్ గారికి నిర్మాత జయ్ వల్లందాస్, దర్శకుడు మహి కోమటిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. “అడుగు అడుగునా” లిరికల్ వీడియో ఈ రోజు నుంచే ఆశ్లీ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్‌లో అందుబాటులో ఉంది. అందరూ వీక్షించి మా చిత్ర బృందాన్ని ఉత్తేజపరచాలని నిర్మాత జయ్ వల్లందాస్ కోరారు.

Exit mobile version