
మెగా ఫ్యామిలీ అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న మోమెంట్.. చిరు 150వ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని.. ఈ సినిమా కంటే ముందు సాంపుల్ గా మెగాస్టార్ తన తనయుడు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘బ్రూస్ లీ’ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించి అభిమానులకు ట్రీట్ ఇవ్వనున్నాడు. ఇది కాసేపు పక్కన పెడితే టాలీవుడ్ లో డాన్సులకు చిరంజీవి పెట్టింది పేరు అని చెప్పడంలో ఎలాంటి అనుమానమూ లేదు. ఆయనకీ వారసుడిగా వచ్చిన రామ్ చరణ్ కూడా ఆయన పేరుని మరింత నిలబెట్టేలా ప్రతి సినిమాలోనూ తన డాన్సులతో ఆకట్టుకుంటూ వస్తున్నాడు.
తాజాగా ఓ నేషనల్ డైలీ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డాన్సులలో మీరు బెస్ట్ అంటారా చరణ్ బెస్ట్ అంటారా అనే ప్రశ్న చిరుని అడిగితే ‘ ఈ విషయంలో ఎలాంటి డౌట్ లేదు నేనే బెస్ట్ డాన్సర్ అని’ చిరు జవాబు ఇచ్చాడు. అలాగే చరణ్ స్పెషాలిటీ గురించి చెబుతూ ‘చరణ్ చిన్నప్పటి నుంచీ చాలా మెచ్యూర్ గా ఉండేవాడు. చెప్పాలంటే తన వయసుకన్నా ఎక్కువ అనుభవం ఉంది. కొన్ని సార్లు నాన్న ఇది చేయకండి, కరెక్ట్ కాదు అనే సలహాలు నాకే ఇస్తుంటాడు. అలాగే చరణ్ సూపర్బ్ ఆర్గనైజర్’ అని చరణ్ కి చిరు కితాబులు కూడా ఇచ్చాడు. దీంతో చిరు – చరణ్ ల మధ్య ఎంతటి అనుబంధం ఉందొ మరోసారి తెలిసింది. ప్రస్తుతం చిరంజీవి చరణ్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి సిద్దమవుతున్నాడు. సెప్టెంబర్ 12 నుంచి చిరు పై వచ్చే ఎపిసోడ్స్ ని షూట్ చేస్తారు.

