
దర్శకధీరుదు ఎస్ఎస్ రాజమౌళి క్రియేట్ చేసిన విజువల్ వండర్ ‘బాహుబలి’ సినిమా అందుకున్న నేషనల్ వైడ్ హిట్ తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఇండియా వైడ్ గా గుర్తింపు వచ్చింది. శివుడు అండ్ బాహుబలిగా ప్రభాస్ అందరినీ మెప్పించాడు. అంతే కాకుండా ఈ సినిమాతో మొదటి సారి బ్రాండ్ అంబాసిడర్ గా మారి మహీంద్ర వెహికల్స్ కి సైన్ చేసాడు. అంతే కాకుండా ప్రభాస్ పై రిలీజ్ చేసిన మహీంద్ర యాడ్ కూడా ప్రభాస్ కి మరింత క్రేజ్ తెచ్చి పెట్టింది. దీంతో ప్రభాస్ కి బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వస్తున్నాయని, అలాగే బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అయిన యష్ రాజ్ ఫిల్మ్స్ వారు ప్రభాస్ ని ధూమ్ 4 లో విలన్ రోల్ కోసం అప్రోచ్ అయ్యారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ బాలీవుడ్ ఆఫర్స్ గురించి మాట్లాడుతూ ‘ బాహుబలి తర్వాత నాకు బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్స్ వస్తున్నాయి, కానీ నేను బాహుబలి 2 ని ఫినిష్ చేసి దాని నుంచి బయటకి వచ్చేంత వరకూ మరో సినిమాకి సైన్ చేయలేను. అందువల్లనే సుజీత్ సినిమాని కూడా హోల్డ్ లో పెట్టాను. అలాగే ఒక సినిమా హిట్ తోనే నేను నేషనల్ స్టార్ అయిపోయాను నటే అది నేను నమ్మనని’ ప్రభాస్ అంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి 2 కోసం వర్కౌట్స్ మొదలు పెట్టాడు.