మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది – సమంత

సమంత హీరోయిన్‌గా, నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. సమంత విజయం సాధించడంతో అభిమానులు వరుస పోస్ట్‌లు పెడుతున్నారు. వారందరికీ సమంత రిప్లై ఇస్తున్నారు. తాజాగా ఓ అభిమాని పోస్ట్‌ను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఆమె ఆసక్తికర క్యాప్షన్‌ పెడుతూ.. ‘డియర్‌ స్వర్ణ (సినిమాలో సమంత పాత్ర పేరు).. ఇంట్లో ఆడపిల్లలు ఎప్పుడూ మహాలక్ష్మిలా ఉండాల్సిన అవసరం లేదు.. ఒక్కోసారి కాళిమాతలాగా కూడా మారాలని నువ్వు నిరూపించావు’ అంటూ ఓ నెటిజన్‌ పోస్ట్ పెట్టాడు.

ఆ నెటిజన్ పెట్టిన పోస్ట్‌ ను సమంత షేర్‌ చేస్తూ.. ‘తక్కువ మాట్లాడాలి. ఎక్కవ పని చేయాలి. మన పనే మన విజయాన్ని చూపిస్తుంది. మీ అందరి అభిమానానికి కృతజ్ఞతలు. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది’ అని సమంత రాసుకురావడం విశేషం. విడుదలకు ముందు నుంచే టికెట్ల బుకింగ్స్‌లో హవా చూపింది ఈ సినిమా. పది రోజుల్లో రూ.73 కోట్లు సాధించింది. నార్త్‌ అమెరికాలో రెండు మిలియన్ల క్లబ్‌లో చేరడం విశేషం.

Exit mobile version