వాళ్ళ లిస్టులో నాది ఆఖరి పేరుగా చేర్చాలి – సుకుమార్

sukumar
ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం అందరూ లఘు చిత్రాల ద్వారా తమ టాలెంట్ ని నిరూపించుకొని ఆ తర్వాత వెండితెర దర్శకులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కానీ డైరెక్టర్ సుకుమార్ మాత్రం డైరెక్టర్ గా తన టాలెంట్ నిరూపించుకున్న తర్వాత లఘు చిత్రం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కలిసి చేసిన ‘ఐ యామ్ దట్ చేంజ్’ అనే లఘు చిత్రం ఆగష్టు 15 కానుకగా విడుదలై అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది..

డైరెక్టర్ గా సినిమాలు తీసిన సుకుమార్ ని లఘు చిత్రం చేసిన అనుభవం ఎలా ఉందని అడిగితే ‘ఈ లఘు చిత్రం చేసాక నేటి తరం ఎంత బాగా లఘు చిత్రాలు చేస్తున్నారా అనిపించింది. ఎందుకంటే నేను చేసిన దానికి నా డైరెక్షన్ టీం పని చేసింది, అలాగే గీత ఆర్ట్స్ నిర్మాణ బృందం కూడా పనిచేసింది. ఇంతమంది ఉండి కూడా ఒక్క రోజులో ఫినిష్ చెయ్యడానికి ఆపసోపాలుపడ్డాము. కానీ ఇప్పటి యువత ఒక్క కెమెరాతో చాలా బాగా లఘు చిత్రాలు తీస్తున్నారు. లఘు చిత్రాలు బాగా తీసే వారి జాబితా తయారు చేస్తే ఆ లిస్టులో నా పేరు ఆఖరిన చేర్చాలని’ అన్నాడు.

Exit mobile version