
సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా క్రియేట్ చేసిన రికార్డులను మరో సినిమా వచ్చి బద్దలు కొట్టడం, ఆ రికార్డ్స్ ని మరో సినిమా బ్రేక్ చెయ్యడమనే ప్రాసెస్ నిర్విరామంగా జరుగుతూనే ఉంటుంది. అలాంటి సందర్భమే ఇప్పుడు చోటు చేసుకోనుంది అది కూడా ఒక నెల గ్యాప్ లోనే జరుగుతుండడం విశేషం. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘లింగ’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో కలుపుకొని యుఎస్ లో 300కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు ఆ రికార్డ్ ని శంకర్ డైరెక్ట్ చేసిన ‘ఐ’ మూవీ బ్రేక్ చేసింది.
మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ‘ఐ’ సినిమాని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి ఒక్క యుఎస్ లోనే 450కి పైగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ సమయంలోపు ఇంకా థియేటర్స్ పెరిగే అవకాశం ఉంది అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు. శంకర్ – విక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ‘ఐ’ సినిమా ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్న ఈ సినిమా తెలుగు ఆడియో లాంచ్ ఈ రోజు హైదరాబాద్ లో జరగనుంది.
ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో విక్రమ్ మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడు. అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో ఉపేన్ పటేల్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు.