నాకు అది నచ్చదు.. నేనింతే – రవితేజ

రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆగస్టు 21న రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రవితేజ, సుమతో ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో సదురు యాంకర్ మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ – రష్మిక రిసెప్షన్‌కి సింపుల్‌గా వచ్చారు.. అదే వైరల్ అయ్యింది. అయినా మీరు బయట ఎందుకు తక్కువగా కనిపిస్తారు ? అని అడగగా.. రవితేజ సమాధానమిస్తూ.. ‘నాకు బయటకు రావడం, అలాగే ఫంక్షన్స్‌కి వెళ్లడం నచ్చదు. అది నా నేచర్. దానికి వేరే కారణం అంటూ ఏమి లేదు’ అని రవితేజ తెలిపారు.

ఇక రవితేజ ఇరుముడి సినిమాలో తన కెరీర్‌ లోనే భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. మొత్తానికి రెగ్యులర్ మాస్ హీరోగా కాకుండా, భావోద్వేగాలతో కూడిన పాత్రలో కనిపించనున్నాడు. పైగా ఫాదర్–డాటర్ ఎమోషన్ తో సాగే సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా ఉంటాయట. ఇక ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్‌ మేళవింపుగా రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 21న రిలీజ్ కాబోతుంది. అన్నట్టు, తమిళంలో ఈ చిత్రం ‘ఇరుముడికట్టు’ పేరుతో విడుదల కానుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకి జీవీ ప్రకాశ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో బేబీ నకాస్త్ర రవితేజ కుమార్తెగా నటిస్తోంది.

Exit mobile version