ఓ మెసేజ్ ని కమర్షియల్ గా చెప్పడంలో సక్సెస్ అయిన డైరెక్టర్ శంకర్ తన్న కెరీర్లో మొదటిసారి ట్రై చేసిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ’. ప్రొడక్షన్ కోసం అనుకున్న దానికంటే ఎక్కువ టైం పడుతుండడం వలన ఈ సినిమా విడుదలలో జాప్యం జరుగుతూ వస్తోంది. దీపావళి రిలీజ్ నుంచి వాయిదా వేసిన ఈ సినిమా రిలీజ్ పై ఇప్పటికీ కచ్చితమైన సమాచారం లేదు.
ఈ సినిమాలోని చాలా భాగాన్ని చైనాలో కూడా షూట్ చేసారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన అమీ జాక్సన్ చైనాలో జరిగిన షూటింగ్ గురించి మాట్లాడుతూ ‘ చైనాలోని 27 డిఫరెంట్ నగరాల్లో ఈ సినిమాని షూట్ చేసాము. మొత్తం చైనాలో ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా 50 రోజులు షూట్ చేసాము. ఐ సినిమాలో మీకు యాక్షన్ సీన్స్, కామెడీ రొమాన్స్ అన్నీ ఉంటాయి. మీరు ఊహించనివి కూడా చాలా ఇందులో ఉంటాయని’ తెలిపింది.
విజువల్స్ పరంగా ఇండియన్ ఫిల్మ్ స్టాండర్డ్స్ ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళేలా ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది. ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్ కూడా ప్రస్తుతం రీ రికార్డింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. తెలుగులో కూడా ‘ఐ’ పేరుతోనే రిలీజ్ అవుతున్న ఈ సినిమా తెలుగు ఆడియోని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ఆస్కార్ రవిచంద్రన్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించాడు.
