‘ఐ’ ఒక రొమాంటిక్ థ్రిల్లర్ ఫిల్మ్ – శంకర్

Shankar

‘ఐ’ టీజర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. గతంలో సోషల్ ఇష్యూలకు కమర్షియల్ అంశాలు జోడించి సూపర్ హిట్స్ కొట్టిన శంకర్ ‘ఐ’ రూపొందించిన విధానం చూసి అదరహొ అంటూ కితాబు ఇచ్చారు. ‘ఐ’ సినిమా కాన్సెప్ట్ ఏంటి..? అనేది ఎవరికీ అర్ధం కాకుండా సినిమాపై ఆసక్తి క్రియేట్ చేశారు శంకర్. తాజాగా ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ ఫిల్మ్ అంటూ ఆ అంచనాలను మరింత పెంచేశారు. రొమాంటిక్ థ్రిల్లర్ ఫిల్మ్ లో విక్రమ్ మృగంగా ఎందుకు మారాడు అనే విషయం తెలియాలంటే దీపావళి వరకు వెయిట్ చేయాలి. సినిమా విడులయ్యేది అప్పుడే కదా..!

గతంలో నేను ‘జెంటిల్ మాన్’, ‘భారతీయుడు’, ‘ఒకే ఒక్కడు’ వంటి సామాజిక సమస్యలతో కూడిన కమర్షియల్ సినిమాలు రూపొందించాను. ‘బాయ్స్’, ‘జీన్స్’ వంటి కామెడీ ఎంటర్టైనర్స్ తెరకేక్కించాను. కాని, ‘ఐ’ వంటి సినిమా తీయలేదు. అందరూ భావిస్తున్నట్టు ఇది సైన్స్ ఫిక్షన్, వోల్ఫ్ మాన్, హల్క్ సినిమా కాదు. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ ఫిల్మ్. నాకు చాలా కొత్త జోనర్. అని దర్శకుడు శంకర్ తెలిపారు.

Exit mobile version