అప్పుడు సినిమాల పై ఇంట్రెస్ట్ పోయింది – మాధవన్

తమిళ సీనియర్ హీరో ఆర్. మాధవన్ ‘సఖి’ సినిమాతో ఫుల్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ‘రంగ్ దే బసంతి’, ‘త్రీ ఇడియట్స్’ లాంటి అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఐతే, తన కెరీర్‌ లో 40 ఏళ్ల వయసులో సినిమాలపై తాను ఆసక్తి కోల్పోయాను అంటూ మాధవన్ తెలిపాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘నా జీవితంలో నాకు 40 ఏళ్ల వయసులో సినిమాల పై ఇంట్రెస్ట్ పోయింది. అసలు అప్పట్లో నేను కొత్త కథల గురించి ఆలోచించడం కూడా మానేశాను. కానీ, నా భార్య సరితే నన్ను మళ్లీ సినిమాల పై ఫోకస్ చేయమని ఎంకరేజ్ చేసింది.

ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యాను’ అని మాధవన్ చెప్పుకొచ్చాడు. అన్నట్టు మాధవన్, నటుడిగా మారకముందు పబ్లిక్ స్పీకింగ్ ట్రైనర్‌గా పనిచేశారు. టెలివిజన్ సీరియల్స్, ప్రకటనల ద్వారా కెరీర్ ప్రారంభించి హీరోగా ఎదిగారు. ఆ తర్వాత చేసిన చాలా చిత్రాలతో మాధవన్ అప్పట్లో యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించారు. సహజమైన నటన, సున్నితమైన భావోద్వేగాలను పలికించడంలో కూడా మాధవన్ కి మంచి పేరు ఉంది.

Exit mobile version