బాలకృష్ణ దర్శకుడిగా పిలిపించుకోవడానికి నాలుగేళ్ళు ఎదురుచుసా – సత్యదేవా

sattya-dev
నందమూరి బాలకృష్ణ నటించిన ‘లయన్’ సినిమా ఈ వారాంతరంలో ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య బాబు ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్ లు, ట్రైలర్ లు సినిమాపై అంచనాలను పెంచే పనిలో వున్నాయి. ఈ సినిమా
లో త్రిష, రాధికా ఆప్టే కధానాయికలు.

ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో దర్శకుడు సత్యదేవా మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడానికి దాదాపు నాలుగేళ్ళు పట్టినట్టు తెలిపారు. బాలకృష్ణ గారికి నాలుగేళ్ళ క్రితమే కధ చెప్పానని, ఇన్ని రోజులూ స్క్రిప్ట్ లో మార్పులు చేస్తూ వచ్చానని తెలిపాడు. ఎట్టకేలకు ఈ చిత్రం ఖరారయినందుకు ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సినిమాలో రాజకీయ నేపధ్యం ఎక్కడా కనబడదని స్పష్టం చేసారు.

Exit mobile version