‘ఐస్ క్రీం’ బడ్జెట్ కేవలం 2,11,832/-

ice-cream
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఐస్ క్రీం’. గత శనివారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల, విమర్శకుల నుండి మిశ్రమ స్పందన లభించింది. ‘ఐస్ క్రీం’ సినిమా తీయడానికి నిర్మాత పెట్టిన పెట్టుబడి తోలిరోజు వసూళ్లు(కలెక్షన్స్)తో రికవరీ అయ్యిందని, ‘ఐస్ క్రీం’ సూపర్ హిట్ సినిమా అని దర్శకులు రామ్ గోపాల్ వర్మ అంటున్నారు.

‘ఐస్ క్రీం’ను కేవలం 2 లక్షల11 వేల 8 వందల 32 రూపాయిల పెట్టుబడితో తీశారట. ‘ఐస్ క్రీం’ చిత్రంలో నటించిన ఆర్టిస్టులకు, టెక్నిషియన్లకు రెమ్యునరేషన్ ఇవలేదు. సినిమా హిట్ అయితే లాభాల్లో షేర్ ఇస్తామని, ప్లాప్ అయితే ఏమి ఇవ్వలేమని ముందే చెప్పాం. మా కాన్సెప్ట్ నచ్చినవారు సినిమాకి పని చేయడానికి ఒప్పుకున్నారు. అందువల్ల 2,11,832 రూపాయల ప్రొడక్షన్ కాస్ట్ లో సినిమా షూటింగ్ పూర్తి చేశాం. ప్రస్తుతం నిర్మాత, సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లో ఉన్నారు. అని వర్మ ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు.

‘ఐస్ క్రీం’ చిత్రం సాదించిన విజయంతో రామ్ గోపాల్ వర్మతో ‘ఐస్ క్రీం-2’ సినిమా నిర్మించడానికి నిర్మాత రామ సత్యనారాయణ సన్నాహాలు చేస్తున్నారు. మరో మూడు రోజుల్లో ‘ఐస్ క్రీం-2’ షూటింగ్ ప్రారంభం అవుతుంది.

Exit mobile version