‘పెద్ది’ రిలీజ్ ట్రైలర్ రాకపోయినా ఇది గ్యారెంటీనా?

‘పెద్ది’ రిలీజ్ ట్రైలర్ రాకపోయినా ఇది గ్యారెంటీనా?

Published on Jun 1, 2026 10:20 AM IST

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన అవైటెడ్ చిత్రం “పెద్ది” ఎట్టకేలకి ఇప్పుడు థియేటర్స్ లో రాబోతుంది. నేడు మేకర్స్ గ్రాండ్ గా విజయవాడలో భారీ ప్రీరిలీజ్ ఈవెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాలు ఈ ఈవెంట్ పై నెలకొన్నాయి. మెయిన్ గా సర్ప్రైజ్ లు, బృందం స్పీచ్ కోసం చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఇదే ఈవెంట్ నుంచి పెద్ది తాలూకా రిలీజ్ ట్రైలర్ ని కూడా చాలా మంది ఆశిస్తున్నారు. అయితే ఈ ట్రైలర్ పై డౌట్స్ కూడా ఉన్నాయి కానీ ఇది కాకుండా మరో సర్ప్రైజ్ ని మాత్రం గ్యారెంటీగా ఆశించవచ్చు. సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ థీమ్ సాంగ్ ని రెహమాన్ రీసెంట్ గానే ప్రామిస్ చేశారు.

మస్సా మస్సా కాకుండా పెద్ది థీమ్ సాంగ్ కూడా ఉందని చెప్పగా దీనిని త్వరలోనే విడుదల చేస్తామని కూడా ప్రామిస్ చేశారు. మరి ఫైనల్ గా ఇదే ఈవెంట్ లో ఈ సాంగ్ ని పెర్ఫామ్ చేసినా ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పొచ్చు. ఆల్రెడీ బుచ్చిబాబు కూడా అసలు ఈ సినిమాకి ఎందుకు రెహమాన్ గారిని తీసుకున్నాను అనేది సినిమాతో తెలుస్తుంది అని చెప్పుకొచ్చాడు. సో ఈ థీమ్ మ్యూజిక్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు