ఇళయరాజా 1000వ ఆల్బమ్ రిలీజ్‌కు రంగం సిద్ధం

Ilayaraja
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన బాణీతో దేశంలోని అద్భుతమైన సంగీత దర్శకుల్లో మొదటి వరుసలో స్థానం సంపాదించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానుల్ని సొంతం చేసుకున్న ఆయన తాజాగా తన 1000వ ఆల్బమ్‌తో శ్రోతలను అలరించేందుకు సిద్ధమైపోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రముఖ దర్శకుడు బాలా రూపొందించిన ‘తారై తప్పట్టై’ సినిమా ఇళయరాజా 1000వ ఆల్బమ్‌గా నమోదవుతోంది.

దీంతో ఈ ఆడియో లాంచ్ కోసం బాలాతో పాటు అతడి టీమ్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 17న చెన్నైలో పెద్ద ఎత్తున ఆడియో వేడుకను నిర్వహించి ఇళయరాజా గౌరవాన్నివ్వాలని బాలా టీమ్ భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఇప్పటికే టీమ్ మునిగిపోయినట్లు తెలుస్తోంది. దేశంలోని పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ ఈవెంట్ నిర్వహించనున్నారని తెలుస్తోంది. శశికుమార్, వరలక్ష్మి శరతకుమార్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు.

Exit mobile version