బాలయ్య డిక్టేటర్ లో ఇలియానా ఐటమ్ సాంగ్!!

ilieana
నట సింహం సందమూరి బాలకృష్ణ తన ఇమేజ్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే కథతో, అభిమానులను మెప్పించడానికి ‘డిక్టేటర్’ అనే టైటిల్ తో తన 99వ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర టీం లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 80% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఇంకా రెండు సాంగ్స్, రెండు ఫైట్స్ తో పాటు కొన్ని సీన్స్ మాత్రమే బాలన్స్ ఉన్నాయి. త్వరలోనే ఈ చిత్ర టీం కోసం ఓ షెడ్యూల్ కోసం ఢిల్లీ వెళ్లనున్నారు.

‘డిక్టేటర్’ సినిమా కోసం తమన్ ఓ సూపర్బ్ ఐటెం సాంగ్ ని కంపోజ్ చేసాడు. ఈ ఐటెం సాంగ్ కోసం ఎవరైతే బాగుంటారా అని వెతికి ఫైనల్ గా ఈ చిత్ర టీం ఇలియానాని ఫైనల్ చేసి అప్రోచ్ అయ్యారు. ఇన్ని రోజులు చాలా సినిమాలలో ఐటెం సాంగ్స్ కి అప్రోచ్ అయినా ఇలియానా ఒప్పుకోకపోవడం లేదా తను అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వలేకపోవడం వలన ఇప్పటివరకూ ఇలియానా ఐటెం సాంగ్స్ చేయలేదు. కానీ బాలయ్య సినిమా అనగానే కాస్ట్ ఇష్టం చూపించడంతో పాటు తను అడిగిన రెమ్యునరేషన్ కూడా ఇస్తాను అనడంతో ఇలియానాఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలానే ఉందని సమాచారం. ఈ నెలాఖరున ఈ సాంగ్ షూటింగ్ ఫినిష్ చేయనున్నారు.

బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి కథని అందించారు. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ సాంగ్ కి సూపర్బ్స్ రెస్పాన్స్ వచ్చింది. శ్రీవాస్ – ఎరోస్ ఇంటర్నేషనల్ వారు కలిసి నిర్మిస్తున్నారు. తమన్ అందించిన మ్యూజిక్ ని డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నాడు.

Exit mobile version