బాహుబలికి అల్ క్లియర్ – కేరళలో భారీగా పెరిగిన థియేటర్స్

BAAHUBALI
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ‘బాహుబలి’. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు అన్ని భాషల నుంచీ అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. గత కొన్ని దశాబ్ద కాలంలో ఈ స్థాయి అంచనాలతో వేరే ఏ సినిమా రిలీజ్ కాలేదు, అలాగే రిలీజ్ అయ్యి ఈ స్థాయి రికాద్ కలెక్షన్స్ ని సాధించలేదు. దేశవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లను కొలగొట్టే దిశగా దూసుకుపోతున్న మూవీ బాహుబలి. అంతా బాగానే ఉన్నా మళయాలంలో మాత్రం ఈ సినిమా భారీగా రిలీజ్ కావాల్సి ఉన్నా కేరళ థియేటర్స్ వారి సమ్మె వలన అనుకున్నంత స్థాయిలో విడుదలకు నోచుకోలేదు.

మళయాలంలో ఈ మధ్యే విడుదలై బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ‘ప్రేమమ్’ సినిమా పైరసీ బారిన పడడమే థియేటర్స్ మూసి వేయడానికి గల కారణం. దాంతో ఈ సినిమా మొదటి రోజు నాలుగు వందలకి పైగా థియేటర్స్ లో రిలీజ్ కావాల్సి ఉంది కానీ మొదటి రోజు 60 థియేటర్స్ లో మాత్రమే రిలీజ్ అయ్యింది. తాజాగా నేడు ఫెడరేషన్ ప్రతినిధులు బంద్‌ విరమించడంమే కాకుండా అన్ని థియేటర్స్ ని ఓపెన్ చెయ్యడంతో మూడవ రోజుకి ఈ సినిమాని ప్రదర్శించే థియేటర్స్ సంఖ్య 60 నుంచి 300కి చేరింది. ప్రస్తుతం కేరళలో 300 థియేటర్స్ లో బాహుబలి ప్రదర్శితమవుతోంది. కేరళలో కూడా ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎగబడుతున్నారు.

మేము అన్ని ఏరియాలకి చెందిన డిస్ట్రిబ్యూటర్స్ తో కాంటాక్ట్ లో ఉన్నాం, వారి దగ్గర నుంచి కచ్చితమైన కలెక్షన్స్ ని మీకు అందిస్తున్నాం. సో ఫ్రెండ్స్ బాహుబలి ప్రత్యేక కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం 123తెలుగు.కామ్ ని విజిట్ చేస్తూ ఉండండి.

Exit mobile version