ఈ ఏడాది దీపావళికి ఇద్దరు తమిళ స్టార్స్ తమ చిత్రాలలోతో బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డారు. విజయ్ బిగిల్ అనే భారీ చిత్రంతో దిగగా, కార్తీ ఖైదీ అనే ప్రయోగాత్మక చిత్రాన్ని వదిలారు. ఈ రెండు చిత్రాలు ఆదరణ దక్కించుకోవడం విశేషం. తెలుగులో కూడా ఈ రెండు చిత్రాలు విడుదల కావడం జరిగింది. ఐతే మల్టీ ప్లెక్స్ లలో మాత్రం విజయ్ బిగిల్ మూవీ కంటే కూడా ఖైదీ చిత్రమే అధిక ఆదరణ దక్కించుకుంటుందని సమాచారం. గత వీకెండ్ నవంబర్ 1 నుండి 3 వరకు పరిశీలిస్తే దేశవ్యాప్తంగా ఉన్న మల్టీ ప్లెక్స్ లలో ఖైదీ మూవీ యావరేజ్ గా 74% ఆక్యుపెన్సీ సాధించగా, బిగిల్ 68% ఆక్యుపెన్సీ కి పరిమితమైంది. ఇక ఖైదీ తెలుగు వర్షన్ 66%, బిగిల్ తెలుగు వర్షన్ విజిల్ 47% ఆక్యుపెన్సీ పొందాయి.
అక్షయ్ కుమార్ హౌస్ ఫుల్ 4, 51% యావరేజ్ ఆక్యుపెన్సీతో ఖైదీ తెలుగు వర్షన్ కంటే తక్కువ సాధించడం గమనార్హం. అటు తెలుగు మరియు తమిళంలో కూడా ఖైదీ మూవీ మల్టీ ప్లెక్స్ లలో విజయ్ బిగిల్ మూవీపై పూర్తి ఆధిపత్యం చూపిస్తుంది. ఖైదీ చిత్రాన్ని దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించగా, బిగిల్ మూవీకి అట్లీ దర్శకత్వం వహించారు.
