మంచి సినిమాలు, ఎవరూ తిట్టుకోని సినిమాలే చేస్తా – ప్రముఖ నిర్మాత

‘ఆదిత్య 369’ లాంటి అద్భుతమైన చిత్రాలని నిర్మించిన ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌. ఆయన నిర్మాతగా తన ప్రయాణం గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను నిర్మాతగా తక్కువ సినిమాలే చేశా. కానీ వాటిలో ఎప్పటికి గుర్తుపెట్టుకున్నే చిత్రాలను చెయ్యగలిగా. ఇంక నుంచి జాగ్రత్తగా ప్లాన్‌ చేస్తున్నా. వచ్చే పదేళ్ళలో ఎటువంటి సినిమాలు చేస్తానో మీరే చూస్తారు. మంచి సినిమాలు, ఎవరూ తిట్టుకోని సినిమాలు మాత్రమే చేస్తా’’ అన్నారు.

అయితే శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మాణంలో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘సమ్మోహనం’. సినిమా నేపథ్యంలో సాగే ఒక అందమైన ప్రేమకథ ఈ చిత్రం. సుధీర్‌బాబు, అదితీరావ్‌ హైదరి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్ర ప్రీ-రిలీజ్‌ వేడుకును జూన్ 10న అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. అలాగే జూన్ 15న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.

Exit mobile version