క్లియర్ కట్ గా ‘గాడ్ ఆఫ్ వార్’కే లీడ్ ఉంటుందా!

ప్రస్తుతం మన దక్షిణాది సినిమా దగ్గర ఇంట్రెస్టింగ్ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టాలీవుడ్ నుంచి డివోషనల్ కంటెంట్ హవా కొనసాగుతుండగా దీనినే విమర్శించిన కోలీవుడ్ ఆడియెన్స్ (ఓ సెక్షన్) కూడా ఇప్పుడు తమ వెర్షన్ నుంచి కూడా సినిమా రాబోతుంది అని మాట్లాడేలా పరిస్థితి మారింది.

అయితే దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి మన నుంచి క్రేజ్ ప్రాజెక్ట్ “గాడ్ ఆఫ్ వార్” అనౌన్స్ కావడం. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ ఎంతో కాలంగా గ్రౌండ్ వర్క్ చేస్తూ అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ ఇంకా మొదలు కాకుండానే ప్రకంపనలు రేపేసింది. మెయిన్ గా కోలీవుడ్ ఆడియెన్స్ లో చిచ్చు రేగింది.

ఇక ఇదిలా ఉండగా ఆ సినిమాకే సమాధానం అన్నట్టుగా స్టార్ నటుడు ధనుష్, వెట్రిమారన్ కాంబినేషన్ లో ‘తమిళ్ మురుగన్’ అంటూ కుమార స్వామి నేపథ్యంలోనే సినిమా అనౌన్స్ చేయడం మరింత చర్చకి దారి తీసింది. అయితే ఇది గాడ్ వార్ కి ఆన్సర్ అన్నట్టే ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది.

కానీ పాన్ ఇండియా వైడ్ మార్కెట్ పరంగా చూపించే ఇంపాక్ట్ లో మాత్రం క్లియర్ కట్ గా ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ కే ఉంటుంది అని చెప్పవచ్చు. కంటెంట్ పరంగా ఎవరి వెర్షన్ వారికి ఉంటుంది కానీ కమర్షియల్ కోణంలో చూస్తే మాత్రం డెఫినెట్ గా గాడ్ ఆఫ్ వార్ భారీ ఓపెనింగ్స్ లాంగ్ రన్ పెట్టే ఛాన్స్ ఉంది. సో ఈ ఇంట్రెస్టింగ్ క్లాష్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.

Exit mobile version