‘అర్జున్ రెడ్డి’పై విజయ్ దేవరకొండ సాలిడ్ అప్డేట్..!

Vijay Devarakonda

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన మైల్‌స్టోన్ చిత్రం ‘అర్జున్ రెడ్డి’ గురించి ఒక సంచలన అప్‌డేట్‌ను అధికారికంగా ఖరారు చేశాడు. టాలీవుడ్‌లో కొత్త చరిత్ర సృష్టించిన ఈ కల్ట్ క్లాసిక్ సినిమా, విడుదలైన 10 సంవత్సరాలు పూర్తి కానున్న సందర్భంగా ఆగస్టు 25, 2027న అన్‌కట్ వర్షన్ తో థియేటర్లలోకి తిరిగి రాబోతోంది.

ఈ ప్రకటనతో అటు విజయ్ ఫ్యాన్స్, ఇటు సినీ ప్రేమికులు పండగ చేసుకుంటున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచి, విజయ్ దేవరకొండను రాత్రికి రాత్రే స్టార్‌గా మార్చేసింది. సెన్సార్‌లో కట్ అయిన సన్నివేశాలను కూడా కలిపి, దర్శకుడు మొదట అనుకున్న అసలైన రా అండ్ రస్టిక్ కట్‌తో ఈసారి థియేటర్లలో ప్రదర్శించనున్నారు.

10 ఏళ్ల తర్వాత ఆనాటి ‘అర్జున్ రెడ్డి’ మేనియాని థియేటర్లలో మళ్లీ ఎక్స్‌పీరియన్స్ చేసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో షాలినీ పాండే హీరోయిన్‌గా నటించింది.

Exit mobile version