మనోజ్ పెళ్ళికి మంచు లక్ష్మి వినూత్న ఆహ్వానం!

lakshmi-manchu
మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి.. నటిగా, నిర్మాతగా, టీవీ వ్యాఖ్యాతగా తానేంటో నిరూపించుకున్నారు. నటిగా, నిర్మాతగానే కాక ఈ మధ్యే ‘దొంగాట’ సినిమా ద్వారా సింగర్ అవతారం కూడా ఎత్తారు. ఎప్పుడూ కొత్తదనమున్న సినిమాలను, పాత్రలను మాత్రమే ఎంచుకొని మెప్పించే మంచు లక్ష్మి నిజ జీవితంలోనూ అదే కొత్తదనాన్ని కోరుకుంటారన్న విషయాన్ని తాజాగా ఋజువు చేశారు.

మంచు లక్ష్మి సోదరుడు మంచు మనోజ్ పెళ్ళికి సిద్ధమైన విషయం తెలిసిందే. మే 20న హై ప్రొఫైల్‌లో ఈ వేడుక జరగనుంది. ఈ వేడుకకు సంబంధించిన ప్రతిదీ రిచ్‌గా ఉండేలా మంచు ఫ్యామిలీ ప్లాన్ చేసింది. వెడ్డింగ్ కార్డు దగ్గరనుండి, వేదిక వరకూ అన్నింటినీ మంచు ఫ్యామిలీ రేంజ్‌కు తగ్గట్టుగా ప్లాన్ చేశారు. ఈ కోవలోనే తన స్నేహితులను, బంధువులను ఆహ్వానించేందుకు మంచు లక్ష్మి ఎంచుకున్న వినూత్న మీడియమ్ అందరినీ ఆకట్టుకుంటోంది. మనోజ్ పెళ్ళికి ఆహ్వానిస్తూ లక్ష్మి ఓ వీడియోను తయారుచేసింది. ఈ వీడియోలో తన స్టైల్లో బంధువులను ఆహ్వానించి ఆకట్టుకుంది. ఇదే వీడియోలో మంచు లక్ష్మి కూతురు నిర్వాన అప్పీరియన్స్ స్పెషల్ అట్రాక్షన్!

Exit mobile version