
మెగా అభిమానులు గత కొద్ది రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోమెంట్.. మా మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ మేకప్ వేసుకొని ఎప్పుడు కెమెరా ముందుకు వస్తాడు.. ఎప్పుడు మా కోసం తెరపై కనిపిస్తాడు.. ఈ రోజుతో దానికి ఫుల్ స్టాప్ పడింది. ఈ రోజు ఉదయం మళ్ళీ చిరు మేకప్ వేసుకొని కెమెరా ముందుకు వచ్చి ఓ యాక్షన్ ఎపిసోడ్ షూట్ లో పాల్గొంటున్నారు. ఇదంతా తన తనయుడు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘బ్రూస్ లీ’ సినిమాలో అయన ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. దానికి సంబందించిన షూటింగ్ లోనే ప్రస్తుతం ఆయన పాల్గొంటున్నాడు.
ఈ విషయం తెలిసినప్పటి నుంచి చిరు ఎంతసేపు ఈ సినిమాలో కనిపిస్తారు అనేదానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆ విషయంపై మేము క్లారిటీ ఇస్తున్నాం.. ఈ చిత్ర వర్గాలు చెప్పిన సమాచారం ప్రకారం బ్రూస్ లీ సినిమాలో చిరు కేవలం 3 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. ఈ టైంలోనే ఆయన ఒక ఫైట్ తో మరియు కొన్ని సీన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకోనున్నాడు. ఉన్నది 3 నిమిషాలే అయినా అభిమానులకు మాత్రం పెద్ద పండగలా ఉండేలా ఆ ఎపిసోడ్ ని తాయారు చేసినట్లు సమాచారం. చిరు పార్ట్ కాకుండా మిగతా పార్ట్ షూటింగ్ కూడా పూర్తి కావచ్చింది.
అక్టోబర్ మొదటి వారం కల్లా షూటింగ్ పూర్తవుతుంది. దసరా కానుకగా అక్టోబర్ 16న సినిమా రిలీజ్ కానుంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.