‘దూత’ సీజన్ 2 కి ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్?

అక్కినేని వారి టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఓటిటి డెబ్యూ ఇచ్చిన మొదటి సిరీస్ “దూత”. ఒక ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సిరీస్ తనకి ఓటిటిలో ఒక బ్లాక్ బస్టర్ ఎంట్రీగా నిలిచింది. అయితే ఈ సిరీస్ కి దర్శకుడు విక్రమ్ కే కుమార్ సీజన్ 2 ని కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సీజన్ 2 కి సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి కాగా ఈసారి దర్శకుడు ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ని ఇందులో చేసినట్టు తెలుస్తుంది.

గత సీజన్ లో జర్నలిజం బ్యాక్ డ్రాప్ లో ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తే ఈసారి మెడికల్ మాఫియాకి సంబంధించిన ఎపిసోడ్స్ ని డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. సో ఈసారి కూడా సీజన్ మంచి థ్రిల్ ఎలిమెంట్స్ తో రానుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సిరీస్ ని ఎక్స్ క్లూజివ్ గా పాపులర్ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు తీసుకొస్తుండగా ప్రాచి దేశాయ్, పార్వతి తిరువొత్తు, ప్రియా భవాని శంకర్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

Exit mobile version