కలాంగారి బయోపిక్ లో విభిన్న కోణం !

తెలుగునాట బయోపిక్ లకు (మహానటి మినహా) పెద్దగా ఆదరణ దక్కకపోయినప్పటికీ.. కొంతమంది దర్శక నిర్మాతలు ఇంకా ప్రముఖ వ్యక్తుల జీవితాలను బయోపిక్ రూపంలో తెరకెక్కించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. తాజాగా భారతరత్న అవార్డు గ్రహీత, భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం ఆజాద్‌ జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. నిర్మాతలు రామబ్రహ్మం సుంకర, అభిషేక్‌ అగర్వాల్‌ ఈ బయోపిక్‌ ను నిర్మించనున్నారు.

కాగా అబ్దుల్‌ కలాంగారు 1931లో తమిళనాడులోని రామేశ్వరంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. పేద కుటుంబలో పుట్టిన ఆయన ఎన్నో అడ్డంకులను ఎదర్కొని రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. ఇక ఈ బయోపిక్ లో కలాంగారి జీవితంలో ఏమి జరిగింది అనే కోణంలో కాకుండా.. చిన్నతనం నుండి వివిధ దశల్లో కలాంగారు ఆలోచనలు ఎలా ఉన్నాయి.

ఆ ఆలోచనల ఆచరణకు ఆయన ఎలాంటి ఇబ్బందులను ఎదురుకున్నారు ? ఆ ఇబ్బందుల్లో కూడా కలాంగారు, అవకాశాలను ఎలా సొంతం చేసుకున్నారు లాంటి ప్రేరణాత్మకమైన విషయాలతో విభిన్న కోణంలో ఈ బయోపిక్ తెరకెక్కనుంది.

Exit mobile version