చిరు మూవీలో చరణ్ గెస్ట్ రోల్…?

చిరంజీవి సైరా మూవీ తరువాత హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారు. దర్శకుడు శివ దాదాపు సంవత్సర కాలంగా చిరు కొరకు ఎదురు చూస్తున్నారు. కమర్షియల్ అంశాలతో కూడిన సోషల్ కాన్సెప్ట్ తో రానున్న ఈ చిత్రం చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22న లాంఛనంగా ప్రారంభం కానుంది. చిరు సరసన హీరోయిన్ గా నాయనతార, కాజల్ , శృతి హాసన్ అంటూ అనేక ఊహాగానాలు వస్తున్నప్పటికీ ఎవరు అనేది అధికారికంగా తెలియరాలేదు.

కాగా ఈ మూవీపై మరో ఆసక్తికర వార్త బయటికొచ్చింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా కనిపించనున్నారట.దర్శకుడు కొరటాల శివ రామ్ చరణ్ కొరకు ఓ గెస్ట్ రోల్ రూపొందిస్తున్నారని అని కొందరు అంటున్నారు. చరణ్ కనిపించేది కొద్ది నిమిషాలే అయినప్పటికీ ఆయనది మూవీలో కీలకమైన పాత్ర అని మరికొందరి వాదన. దీనిపై అధికారంగా ఎటువంటి ప్రకటన లేనప్పటికీ ఇండస్ట్రీలో ప్రముఖంగా వినిపిస్తుంది.

Exit mobile version