ఇంట్రెస్టింగ్.. RC16 కి ఈ వర్క్ చాలా తక్కువ?

rc16 m

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. అయితే గేమ్ ఛేంజర్ లాంటి వైఫల్యం చరణ్ ఎదుర్కొన్నప్పటికీ ఈ సినిమాపై సాలిడ్ బజ్ అయితే నెలకొంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతుండగా ఈ చిత్రంపై ఒక ఇంట్రెస్టింగ్ టాక్ ఇపుడు వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ మధ్య కాలంలో వస్తున్న పలు చిత్రాల్లా ఈ సినిమా విఎఫ్ఎక్స్ తో పెద్దగా పని లేదట.

దాదాపు నిజమైన లొకేషన్స్, భారీ సెట్టింగ్స్ లోనే సినిమాని బుచ్చిబాబు తెరకెక్కిస్తుండగా వాటితోనే సినిమా దాదాపు కనిపిస్తుంది అని తెలుస్తుంది. అలాగే సినిమా పీరియాడిక్ జానర్ కూడా కాకపోవడంతో విజువల్ ఎఫెక్ట్స్ పనులు పెద్దగా అవసరం లేవు అని తెలుస్తుంది. సో ఈ సాలిడ్ ప్రాజెక్ట్ లో మరింత నాచురల్ గా కనిపిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version