కమల్ – అమలల మూవీ క్రేజీ టైటిల్ ఇదే!!

Kaml-hassan-Amala
యూనివర్సల్ స్టార్ ఉలగనాయగన్ కమల్ హాసన్ ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో చేసిన ‘చీకటి రాజ్యం’ సినిమా నిన్న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి థ్రిల్లర్ సినిమాగా టాక్ సొంతం చేసుకుంది. గత కొద్ది రోజులుగా ‘చీకటి రాజ్యం’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న కమల్ హాసన్ ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి డీసెంట్ టాక్ ని సొంతం చేసుకోవడంతో కాస్త రిలాక్స్ అయ్యాడు. అలాగే తన దృష్టిని తరుపరి సినిమాపై పెట్టాడు. ఈ సినిమా మళయాల సినీ దర్శకుడు టి. కె. రాజీవ్ దర్శకత్వంలో ఉంటుందని ఇది వరకే తెలియజేశాం.

ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు సీనియర్ యాక్టర్స్ అమల అక్కినేని, జరీన వాహీబ్ లతో పాటు ఓ కొత్త హీరోయిన్ కూడా నటిస్తోంది. తాజాగా కమల్ టీం ఈ సినిమాకి ‘అమ్మ నాన్న ఆట’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసింది. ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ అమెరికాలోనే జరుగుతుంది. ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా మలయాళంలో కూడా షూట్ చేయనున్నారు. కమల్ హాసన్ ఈ సినిమాని కూడా చీకటి రాజ్యం తరహాలోనే 40రోజుల్లో మొత్తం షూటింగ్ ని ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు.

Exit mobile version