ఇంటరెస్టింగ్ టైటిల్‌తో సందీప్ కిషన్ కొత్త సినిమా!

sandeep-kisan1
సందీప్ కిషన్.. వైవిధ్యభరితమైన కథాంశాలను ఎంపిక చేసుకుంటూ ఇప్పుడున్న యువహీరోల్లో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు. తాజాగా ‘టైగర్’తో మంచి హిట్ కొట్టిన ఈ హీరో, ఒక తమిళ సినిమాను విడుదలకు సిద్ధం చేయడమే కాక మరో రెండు సినిమాలను లైన్లో పెట్టి దూసుకుపోతున్నాడు. ఇక ఈ రెండు సినిమాల్లో తెలుగు, తమిళ భాషల్లో స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోన్న సినిమా ఒకటికాగా అంజిరెడ్డి ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపొందనున్న ‘ఒక్క అమ్మాయి తప్ప’ అనేది మరో సినిమా.
‘ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్న ప్రీ టైటిల్, ‘ఒక్క అమ్మాయి తప్ప’ అన్న ఆసక్తికర టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. రాజ్ సింహ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను అంజిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అఫీషియల్‌గా లాంచ్ అయింది. వీవీ వినాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని సినిమా యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఛోటా కె నాయుడు, మిక్కీ జే మేయర్, అనల్ అరసు.. ఇలా టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తోన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది.
Exit mobile version